అప్పటివరకు వారి ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. గత సంవత్సరం నవంబర్ లో ఇటలీలో లావణ్య, వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలా ఉండగా.... వరుణ్ తేజ్, లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో వీరి పెళ్లి వీడియోని స్పెషల్ గా డిజైన్ చేశారు.
వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడడం, పెళ్లి వేడుకల్లోని కొన్ని స్పెషల్ విజువల్స్ ని కలిపి ఓ వీడియోను తయారు చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో వరుణ్, లావణ్య పెళ్లి, కుటుంబ సభ్యులు అందరూ కలిసి డ్యాన్సులు చేయడం, ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫోటోషూట్లు ఇలా అన్నింటినీ కలిపి చూపించారు.
మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి సందడి చేశారు. దీంతో ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ వరుణ్ తేజ్, లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ వీడియో తీయడానికి దాదాపు కోట్లలో డబ్బులు ఖర్చు అయ్యాయట. ఒక్క వీడియోకి ఇన్ని కోట్లు డబ్బులు ఖర్చు అయ్యాయి అంటే ఎంత స్పెషల్ గా ఈ వీడియోని ప్లాన్ చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.