సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వారిలో కొన్ని జంటలు వివాహం తర్వాత కొంతకాలం ఎంతో సంతోషంగా గడిపిన ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి పెద్దవయ్యి ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయిన వారు ఉన్నారు. అలాగే ప్రేమించే పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని అద్భుతంగా కొనసాగించిన వారు ఎన్నో జంటలు ఉన్నాయి.

ఇకపోతే కొంతకాలం క్రితమే మంచి గుర్తింపును సంపాదించుకున్న సినీ పరిశ్రమకు చెందిన వారు అయినటువంటి సిద్ధార్థ్ , అదితి రావు హైదరి ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సిద్ధార్థ్ , అదితి రావు హైదరి కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కొన్ని ప్రదేశాల్లో కలిసి కనిపించడంతో వీరు ప్రేమలో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. కానీ వీరు మాత్రం దానిపై స్పందించలేదు. దానితో కొంత మంది వీరు క్యాజువల్ గా అలా బయటకు వెళ్లి ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు బయటికి వచ్చి ఉంటాయి. అంతే తప్ప వీరు ప్రేమించుకోలేదు అని కొంత మంది , వీరు ప్రేమలో ఉన్నారు అని కొంతమంది వాదనను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక కొంత మంది వీరు ప్రేమలోనే ఉన్నారు కానీ పెళ్లి చేసుకుంటారు లేదో తెలియదు  అనే వాదనను మరి కొంత మంది ఆ సమయంలో వ్యక్తం చేసిన వారు ఉన్నారు.

ఇలా అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇక చివరకు వీరు ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనితో ఒక్క సారిగా వీరి ఎంగేజ్మెంట్ న్యూస్ వైరల్ అయింది. దానితో కొంత కాలం తర్వాత వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక 2024 వ సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీన వీరిద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం మీరు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: