మ్యారేజేస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు..మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే  చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి.రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం..అనేస్తున్నారు. అలా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. అలా ప్రేమించుకొని ఒక్కటైన జంటలలో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ఒకరు.‘బద్రి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీళ్లిద్దరు ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో నటించారు.అయితే బద్రి సినిమా పవన్ కెరీర్లోనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఈ సినిమాతో రేణు దేశాయ్.. అతని జీవిత భాగస్వామిగా మారింది.బద్రి చిత్రంలో కలసి నటించిన పవన్, రేణుకొన్నేళ్లు డేటింగ్ చేసిన తరువాత 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2013లో వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత, అభిప్రాయ బేధాల వల్ల  విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య బంధాలు, ప్రేమానురాగాలు ఉన్నట్టు చాలా సందర్భాలు రుజువు చేశాయి. ప్రస్తుతం రేణు తన కూతురు, కొడుకుతో కలిసి పుణేలో ఉంటుంది.ప్రస్తుతం ఈయన రష్యన్ మోడల్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చినా స్నేహం కొనసాగిస్తున్నారు. పిల్లలకు తండ్రిగా కొనసాగుతున్నారు.నిజానికి పవన్ కళ్యాణ్ తరచుగా పూణే వెళ్ళేవాడని సమాచారం. పిల్లలు ఆయనతో టచ్ లో ఉండేవారు. కలవాలని ఫోన్ చేస్తే వీలు చేసుకుని పవన్ కళ్యాణ్ పూణే వెళ్లేవాడట. ఇదిలావుండగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో అకిరా, అధ్య ల బాండింగ్ గురించి ఇలా చెప్పుకొచ్చింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ...  ఆద్య చాలా కమాండింగ్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చూసి నువ్వు ఎప్పుడు కలుస్తావు. మమ్మల్ని చూడాలని లేదా... నువ్వు వెంటనే రావాలని గట్టిగా మాట్లాడుతుంది. అకిరా అలా కాదు. ఆద్యతో నేను మరాఠిలో మాట్లాడతాను. తనతో మరాఠీలోనే మాట్లాడాలని ఆద్య కండిషన్ పెట్టింది. అకీరాతో మాత్రం తెలుగులో మాట్లాడతాను. వాళ్ళ నాన్న భాష అకీరా మర్చిపోకూడదు కదా అకీరా-పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు లైఫ్, ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య సినిమా ప్రస్తావన రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను. విడాకుల తర్వాత మేము మిత్రులు గా కొనసాగుతున్నామని గతంలో కూడా నేను చెప్పాను.ఆద్య వాళ్ళ నాన్నతో మరాఠీలోనే మాట్లాడుతుంది. నా కోసం ఆయన భాష నేర్చుకోలేదు. ఆద్య కోసం మరాఠీ నేర్చుకున్నారు. ఆద్య-పవన్ మరాఠీలో మాట్లాడుకుంటారని... చెప్పుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్, అకీరా కలిస్తే సినిమా ప్రస్తావన రాదట. లైఫ్, ఫిలాసఫీ మాట్లాడుకుంటారట. ఇక అకీరా టీనేజ్ దాటేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: