- 27 ఏళ్లు అయినా అన్యోన్య బంధం..
- శ్రీకాంత్ ఊహల లవ్ స్టోరీ..
తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఆ తర్వాత కుటుంబ కథా ప్రేక్షకులకు తన నటనతో ఎంత దగ్గరయ్యారో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో విలన్ గా చేసినప్పటికీ ఆ తర్వాత ఈయనకు కూడా హీరో ఆఫర్లు వచ్చాయి. అలా మిడిల్ రేంజ్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎక్కువగా కుటుంబ కథా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే అలాంటి శ్రీకాంత్ నటి ఊహను ఎలా ప్రేమలో పడేసారు.. వీరిద్దరి పెళ్లి ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.
శ్రీకాంత్ ఊహ ప్రేమ పెళ్లి:
శ్రీకాంత్ నటి ఊహతో ఆమె, కూతురు, ఆయన గారు వంటి సినిమాల్లో కలిసి నటించారు. అయితే వరుస సినిమాలు చేసే సమయంలో ఊహతో శ్రీకాంత్ కి పరిచయం ఏర్పడి అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇక వీరిద్దరి ప్రేమ విషయం బాగున్నప్పటికీ ఇంట్లో వాళ్లకు చెప్పడానికి చాలా భయపడ్డారట. కానీ శ్రీకాంత్ మాత్రం ఊహకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనే విషయం తెలిసి ఒక అడుగు ముందుకు వేసి తన తల్లిదండ్రులకు తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా నేరుగా ఊహ ఇంటికి వెళ్లి ఊహను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఊహ పేరెంట్స్ కి చెప్పారట. అయితే ఒక్కసారిగా శ్రీకాంత్ మాటలకి షాక్ అయిపోయిన ఊహ పేరెంట్స్ మొదట పెళ్లికి ఒప్పుకోలేదట. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చే అబ్బాయిని మేము మా ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలి అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్లపై మాకు నమ్మకం లేదు అని మొహం మీదే రిజెక్ట్ చేశారట. దాంతో శ్రీకాంత్ నేను ఎలాంటి వాడినో మీరే ఇంకొన్ని రోజులు చూసి నా ప్రవర్తన గమనించాకే మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి వెళ్లిపోయారట.