నాగార్జున.. ఏ విషయం మాట్లాడిన.. ఏ పని చేసినా.. ఒకటికి నాలుగు సార్లు బాగానే ఆలోచిస్తాడు అన్న పేరు ఎప్పటినుంచో వినిపిస్తుంది . అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రి లోకి అడుగుపెట్టిన నాగార్జున ఆ తర్వాత కింగ్ నాగార్జున గా మారాడు. ఎలా అంటే అప్పట్లో అమ్మాయిలు , ఆంటీలు అందరు కూడా నాగార్జున నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ కు ఎగబడి వెళ్లిపోయేవారు. అంతలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో . కాగా ఇప్పుడు అక్కినేని నాగార్జున స్టార్ స్టేటస్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. .


త్వరలోనే ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అనే అమ్మాయిని నాగచైతన్య గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చారు. ఆమె తో డేటింగ్ చేశాడు . ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి . కానీ దేని అఫీషియల్ గా ప్రకటించలేదు.  రీసెంట్గా నిశ్చితార్థం చేసుకొని పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది.



కాగ కొత్త కోడలు పిల్ల కోసం నాగ్ మామ స్పెషల్ గిఫ్ట్ కూడా రెడీ చేశారట . ఇంటికొచ్చిన కోడలికి గిఫ్ట్ ఇవ్వడం చాలా చాలా ట్రెడిషినల్  గా భావిస్తారు.  మరి ముఖ్యంగా పెద్ద ఇంటి వాళ్ళు ఇంకా బాగా ట్రెడిషన్ గా ఫాలో అవుతూ ఉంటారు . కాగా  సమంతకి డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేసిన నాగార్జున..  ఇప్పుడు తన రెండో కోడలికి కోట్లు ఖర్చు చేసి కారు కొనివ్వబోతున్నారట . శోభిత ధూళిపాళ్లకి కార్లు పిచ్చి ఎక్కువగా ఉందట . డిఫరెంట్ డిఫరెంట్ కార్లు నడపడం అంటే ఆమెకు చాలా చాలా ఇష్టమట . అందుకే కోడలు పిల్ల కోసం ఏకంగా  కోట్లు ఖర్చు చేసి మరి కారు కొనిస్తున్నారట. దీంతో నాగ్ మామకు కోడలు పిల్ల అంటే ఎంత ఇష్టమో అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఆ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: