ఆహుతి అనే సినిమాలో ఆయన హీరోగా నటించగా ఆ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.. సుమలత . ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన సుమలత 1963 లో జన్మించారు. 1978లో 'కరుణామయుడు' సినిమాలో తొలిసారిగా తెరపై కనిపించారు. 'ఆహుతి'లో నటించడానికి ముందే టాలీవుడ్‌లో సుమలత హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన సినిమా సెట్స్‌పై ఎవరైనా నీరసంగా కనిపిస్తే అంబరీష్ సహించేవారు కాదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎనర్జీ ఉండాల్సిందే. సుమలతది రిజర్వ్‌డ్ మనస్తత్వం. అవసరమైతేనే ఎవరితోనైనా మాట్లాడేవారు. షాట్ గ్యాప్‌లో పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. అంబరీష్ మనస్తత్వం గురించి రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉండటంతో, మొదట ఆయనతో కలిసి నటించడానికి సుమలత వెనుకాడారు. అందుకని ఆమె ఆయన విషయంలో దూరం పాటిస్తూ వచ్చారు.
ఇక పరిమితంగానే ఆయనతో మాట్లాడేవారు. అయితే 1987లో 'న్యూ ఢిల్లీ' సినిమాకు మరోసారి కలిసి పనిచేసినప్పుడు ఆ ఇద్దరి మధ్య స్నేహం పెనవేసుకుని, సన్నిహితులయ్యారు. మిగతా సినీ తారలతో పోలిస్తే సుమలత నేచర్ భిన్నంగా కనిపించడంతో అంబరీష్ ఆమెపై అభిమానం, అనురాగం పెంచుకున్నారు. దాంతో 1989లో సుమలతకు తనదైన స్టైల్‌లో ప్రపోజ్ చేశారు. ఆమెకు "రెబల్ ఇన్ ట్రబుల్" అంటూ ఓ లెటర్ ద్వారా తన ప్రపోజల్ తెలియజేశానని అంబరీష్ స్వయంగా తెలిపారు. పైకి ఎంత ఆవేశపరుడిగా కనిపించినా, ఆయనలోని నిజాయితీ, నిబద్ధత, తనపైన అనురాగాన్ని గుర్తించిన సుమలత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎంతో హుందాగా కనిపించే అందమైన సూమలత రెబల్ స్టార్ గా కనిపించే అంబరీష్ ను 1991 లో పెళ్లి చేసుకున్నారు. ఇక మీరు 27 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా వారి జీవితం కొనసాగుతూ వచ్చింది.. రెండేళ్ల క్రితం తమ పెళ్లిరోజును తమ సహ తారలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు ఆ జంట. అనుకోకుండా అనారోగ్యం బారినపడిన అంబరీష్ ఆకస్మికంగా 2018 నవంబర్‌లో కన్నుమూశారు. ఆ ఇద్దరి దాంపత్యానికి చిహ్నంగా కుమారుడు అభిషేక్ ఉన్నాడు. ఇప్పుడు సుమలతకు కుమారుడే సర్వస్వం.