ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన వార్తలను ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇది మొదటి పెళ్లి గురించి అయితే పెద్దగా మాట్లాడుకునే వారు కాదేమో . రెండో పెళ్లి గురించి కాబట్టి ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా అసలు శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్యకు పరిచయం ఎలా ఏర్పడింది..? వీళ్లిద్దర మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? అసలు వీరిద్దరి ప్రేమ పుట్టడం కారణంగానే సమంతకు విడాకులు ఇచ్చేసాడా ..? అన్న రకరకాల డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  వీళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఓ తెలుగు యంగ్ హీరో అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన మరెవరో కాదు "అడవి శేష్". ఎస్ అడవి శేష్ సినిమాలో శోభిత ధూళిపాళ్ల నటించింది . గూడచారి సినిమాలో ఆమె హీరోయిన్.  అలాంటి పాత్రలో మెరిసి సినిమాకి మరింత హైప్ ఇచ్చింది . ఆ మూమెంట్లోనే నాగచైతన్యకు ఈమె పరిచయం అయిందట.  దానికి కారణం కూడా యార్లగడ్డ సుప్రియ . యార్లగడ్డ సుప్రియ - అడవి శేష్ మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది .



పలు అక్కినేని ఫ్యామిలీ ఫొటోస్ లో కూడా ఆయన దర్శనమిచ్చారు. ఆ టైంలోనే నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల కు పరిచయం ఏర్పడిందట . ఆ తర్వాత వీళ్ల అభిరుచులు కలవడం.. మంచి ఫ్రెండ్స్ గా మారారట . అయితే సమంతకు విడాకులు ఇచ్చేసిన తర్వాత శోభిత ధూళిపాళ్ల బాగా నాగచైతన్యకు సపోర్ట్ చేయడం .. ఆయన డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేయడంతో ఆటోమేటిక్గా నాగచైతన్య ఆమె చూపించే ప్రేమకు కనెక్ట్ అయిపోయాడట . అంతేకాదు మొదటగా నాగచైతన్యనే శోభిత కి ప్రపోజ్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారట.  అలా నాగచైతన్య - శోభితపెళ్లి జరగడానికి కారణమయ్యాడు అడవి శేష్ అంటూ టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.  ఇప్పుడు వీళ్ళ పెళ్లికి సంబంధించిన మాట టూ హాట్ గా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: