బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2018లో దిల్బర్ దిల్బర్ పాటతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా డాన్సర్ గాను తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.


టెంపర్, షేర్, లోఫర్, కిక్ 2, బాహుబలి వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి నటించనుంది. హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. ఇందులో ఈ బ్యూటీ ఓ కీలక పాత్రను పోషించనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో స్పెషల్ పాటలో నటించనుందట. కాగా, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నందుకు ఈ బ్యూటీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.


ఈ పాట కోసం ఏకంగా ఈ బ్యూటీ 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.... నోరాను గతంలో ఇద్దరు నిర్మాతలు మోసం చేశారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలలోని నిర్మాతలు తనకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని నోరా ఆరోపించింది. ఇక వాటి గురించి తాను పట్టించుకోలేదని వెల్లడించింది. తన కెరీర్ తనకు ముఖ్యమని చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే నేను దోపిడికి గురయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహి.


ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కాదు. నేను ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. నేను అందంగా లేనని నన్ను అవమానించారు. ఆ బాధ కోపంతో నేను నా ఫోన్ కూడా పగలగొట్టానని ఈ బ్యూటీ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: