యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన నిర్మించిన చిత్రం 'క ' ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు. సరైన సక్సెస్ లేక ఎన్నో ఏళ్ళు అవుతున్న కిరణ్ అబ్బవరనికి ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. కొత్త దర్శకులైనప్పటికీ కూడా కథ మీద ఉండే నమ్మకంతో దాదాపుగా 15 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు చేశారట. ఈ సినిమాలో ఉన్న పాయింట్ వేరే సినిమాలలో ఎక్కడా కూడా టచ్ చేయలేదని ఎక్కడైనా కనిపించినా తాను ఇక ఈ సినిమాలను వదిలేస్తానంటూ రిలీజ్ ముందే ఒక ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దీంతో ఈ సినిమా చూసిన వారందరూ కూడా కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు.. ఈ సినిమాలోని పాయింటు ఎవరూ కూడా ఇంత ముందు ఎక్కడ టచ్ చేయలేని విధంగా ఉందని బుర్ర తిరిగిపోయేలా ట్విస్టులతో ఉందని సినిమా చూసిన వారంతా బ్లాక్ బాస్టర్ అంటూ తెలిపారు. ఇక మరొక నిర్మాత నాగవంశీ కూడా లక్కీ భాస్కర్ సినిమాని ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ లో తీశామని ఈ సినిమాలో ఎవరైనా కూడా తప్పులు దొరికితే చూపిస్తే.. వాళ్ళని పిలిచి మరి పార్టీ ఇస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. డైరెక్టర్ నాగవంశి చెప్పినట్టుగానే ఈ సినిమా చూసిన ఆడియస్స్ కూడా కాన్సెప్ట్ సరికొత్తగా ఉందని తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి చిత్రం రాలేదని కూడా తెలియజేశారు. వాస్తవానికి ఇలాంటి డేరింగ్ స్టేట్స్మెంట్ ఇవ్వాలి అంటే చాలా గట్స్ ఉండాలి. అలా నాగ వంశి, కిరణ్ అబ్బవరం చెప్పడంతో ఈ సినిమా చెప్పి మరి సక్సెస్ కొట్టారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలకు ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చిన వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని చెప్పవచ్చు. కేవలం సినిమా కథ మీద ఉండే నమ్మకంతోనే చెప్పి మరి హిట్టు కొట్టారు.