ఇక ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరు. అలాగే మన భారతదేశంలో అత్యంత ధనిక నటుల్లో కూడా ఒకరు. కెరియర్ మొదటి నుంచి చూస్తే జీరో నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టి. ఇప్పుడు కొన్ని వేలకోట్ల ఆస్తులకు యజమాని అయ్యాడు. అలాగే బాలీవుడ్ లో వస్తున్న కొన్ని నివేదికల ప్రకారం షారుక్ ఖాన్ నికర ఆస్తులు విలువ 870 మిలియన్ డాలర్లు.. అంటే ఆయన ఆస్తి విలువ దాదాపు 7300 కోట్లు.. అలాగే షారుక్ ఖాన్ తర్వాత మరో బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఇండియాలోనే అత్యంత సంపన్న నటుల జాబితాలో ఉన్నారు. అలాగే ఆమె ఆస్తులు విలువ సుమారు 4600 కోట్లు. ఇక షారుక్ ఖాన్ 2023 నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.


అలాగే ఆయన ఒక్కో సినిమాకు 150 నుంచి 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. గత సంవత్సరం ఆయన నటించిన జవాన్ , పఠాన్ , డంకి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక దీంతో షారుక్ ఖాన్ సంపద మరింత పెరిగింది. అలాగే షారుక్ ఖాన్ సినిమాల్లో నటించడమే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను కూడా కొనసాగిస్తున్నాడు .. ఇది కూడా ఆయన సంపాదన పెంచడానికి ఆదాయ వనరు. ఈ ప్రొడ‌క్షన్ హౌస్ లో షారుక్ ఖాన్ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. అలాగే ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ కు షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ అలాగే ఆ టీం ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ టీంకు మరో హీరోయిన్ జుహీ చావ్లా కూడా సహాయజమాని.


అలాగే ఈ టీం విలువ కోన్నీ వందల కోట్లు .. ఇక ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కు షారుక్ ఖాన్ 5 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. షారుఖ్ ఖాన్‌కు ‘మన్నత్’ అనే పేరు మీద ఓ లగ్జరీ ఇల్లు కూడా ఉంది. దీని ఖరీదు వందల కోట్ల రూపాయలు. ఈ ఇల్లు ముంబై నడిబొడ్డున ఉంది. షారుక్‌ ఖాన్‌ కష్టాల్లో ఉన్నప్పుడు కొన్న ఇల్లు ఇది. ఇది కాకుండా షారూఖ్ ఖాన్‌కు దుబాయ్ మరియు లండన్‌లో ఇళ్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఇక కింగ్ ఖాన్ గ్యారేజ్ లో లగ్జరీ కార్లు, బైక్స్ ఉండనే ఉన్నాయి. ఇలా షారుక్ ఖాన్ ఇండియాలోనే అత్యంత ధనిక హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: