ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా లేవల్లో సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండడంతో ఇతర భాషలలోని నటీనటులను కూడా తీసుకుంటూ ఉన్నారు చిత్ర బృందం. అలా పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో నటించిన ధనుంజయ నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ నటుడు దీపావళి పండుగ రోజున అభిమానులకు ఒక శుభవార్త తెలియజేస్తూ సడన్ షాక్ ఇచ్చారు.. తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భార్యతో కొన్ని ఫోటోలను పంచుకోవడం జరిగింది.


అయితే ఇలా సడన్గా సైలెంట్ షాక్ ఇవ్వడంతో పలువురు అభిమానులు ఆశ్చర్యపోతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇకపోతే ధనుంజయ వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు ధన్యత.. ఇమే సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదట. వీరిద్దరూ మైసూరులో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడడంతో అలా ఒకరికి ఒకరు కొన్నేళ్ల పాటు బాగా పరిచయం ఉన్నారట. ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు తీసుకు వచ్చినట్లు సమాచారం.


వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన 2025లో మైసూరులో చాలా గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు ఈ జంట. ఉదయం వివాహం చేసుకొని అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ కూడా మైసూర్ లోని మొట్టమొదటి కలవడంతో అక్కడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు ధనుంజయ ఈ వీడియోని షేర్ చేస్తూ తన కాబోయే భార్య మీద కూడా ఒక కవిత్వాన్ని రాసుకొచ్చారు. పోస్టులు కూడా వైరల్ గా మారుతున్నా..పుష్ప-2 చిత్రంలో కూడా ఈ నటుడు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా నటుడు ధనంజయ బిజీగా ఉన్నట్లు వార్తలు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: