పంజాబ్ రాజధాని ఛండీగఢ్‌లో పుట్టి పెరిగింది ఆశాశైని.. మోడల్గా కెరియర్ మొదలు పెట్టింది తన ఫ్యామిలీ కోల్కత్తాకు షిఫ్ట్ కావడంతో మిస్ బెంగాలీ అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 1999లో ప్రేమ కోసం సినిమాతో నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత అంతా మన మంచికే , మనసున్న మారాజు , చాలా బాగుంది , చెప్పాలని ఉంది , సర్దుకుపోదాం రండి, అక్కా బావెక్కడ, నవ్వుతూ బ్రతకాలిరా, నరసింహనాయుడు, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్ , ఓ చిన్నదాన వంటి పలు సినిమాల్లో నటించింది .
అలాగే పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన 143లో కూడా ఆశా జర్నలిస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం , హిందీ , కన్నడ అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత చట్టం , బ్రోకర్ , ఆ ఇంట్లో మనీ మనీ మోర్ మనీ వంటి తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో కూడా మెరిసింది. అయితే 2011 తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కడ కనిపించలేదు ఆశ. కేవలం బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకే పరిమితమైంది. ముఖ్యంగా ఏక్తా కపూర్ నిర్మించిన కొన్ని బోల్డ్ వెబ్ సిరీసులతో అక్కడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటుంది. ఆ మధ్యన ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని.. అతడు తనని చిత్రహింసలకు గురి చేశాడంటూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది .