ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించగా.. అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, రణబీర్ సింగ్, టైగర్ శ్రాఫ్, దీపిక పదకొన్ లాంటి అగ్రతారలు అందరూ కూడా కీలక పాత్రలో నటించారు. సింగం భార్య పాత్రలో కరీనాకపూర్ నటించింది.
అది సరేగాని సినిమా ఎలా ఉందంటే
ఓమర్ హఫీస్ (జాకీ శ్రాఫ్) ను బాజీరావు సింగం అదేనండి అజయ్ దేవగన్ అరెస్ట్ చేస్తారు. తర్వాత బాజీరావుని నేతృత్వంలో శివ స్క్వాడ్ ఏర్పాటు చేస్తాడు హోమంత్రి (రవి కిషన్). అయితే ఈ స్క్వాడ్ ఏర్పాటైన రెండేళ్లకి బాజీరావు సింగం భార్య అవని (కరీనాకపూర్ను) హాఫిజ్ మనవడు డేంజర్ లంక అని పిలిచే జుబైర్ కిడ్నాప్ చేస్తాడు. దానికి ముందు తమిళనాడులోని శక్తి శెట్టి (దీపిక పదుకొనే) విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ ను తగలబెట్టేస్తాడు. అయితే అవనీని శ్రీలంక తీసుకువెళ్తాడు. అక్కడి నుంచి భార్యను తీసుకురావడానికి సింగం ఏమి చేశాడు అన్నది కథ. ఇక మధ్యలో అగ్రతాల క్యారెక్టర్స్ ఎక్కడ యాడ్ అవుతూ వచ్చారూ అన్నదే స్టోరీ.
సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఫైట్ తో యాడ్ అవుతూ వస్తుంది ఇక ప్రతి క్యారెక్టర్ కూడా బాంబులు వేస్తుంది. తుపాకులు కాలుస్తుంది. అయితే ఒక పోలీస్ కథకు రామాయణాన్ని అనే పోస్టర్ ను అతికించి అటు రోహిత్ శెట్టి సినిమా తీశాడు అన్నది చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ కి రామాయణం కథను యాడ్ చేయడం అవసరం లేకపోయినప్పటికీ అనవసరంగా ఇరికించారు అనే భావన ప్రేక్షకులకు కలిగింది. అయితే ఒక రకంగా యాక్షన్ సన్నివేశాలను రోహిత్ శెట్టి తనదైన అనుభవంతో బాగా తెరకెక్కించినప్పటికీ రొటీన్ కథను ఎంచుకోవడంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతున్నారు.
ఎవరు ఎలా చేశారు అంటే : ఇక అప్పటికే పోలీస్ పాత్రలో నటించిన అనుభవం అజయ్ దేవగన్, రణవీర్ సింగ్,అక్షయ్ కుమార్ తమ పాత్రల్లో అగరగొట్టేసారు. వాళ్ల పరిధి మేరకు బాగా నటటించారు. కానీ ఈ సినిమాకు కథ మైనస్ గా మారింది.
ప్లస్ పాయింట్లు : యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్లు : రొటీన్ గా సాగే కథ, పెద్దగా ట్విస్టులు లేకపోవడం..
రోహిత్ శెట్టి రొటీన్ కథతో సినిమాను కిచిడి కిచిడి చేసేసాడు..