ఈ మధ్యకాలంలో ఫెస్టివల్ కి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. ముఖ్యంగా దసరా సీజన్లో తెలుగు సినిమాలు విడుదలైన పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దీంతో అందరి దృష్టి దీపావళికి మళ్ళింది.ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చిన్న సినిమాలు విడుదల అవ్వగా కొత్త మెరుపులను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత దీపావళికి విడుదలైన చిత్రాలతో హౌస్ ఫుల్ బోర్డులు థియేటర్ల వద్ద కనిపిస్తున్నాయట. అలా పండక్కి వచ్చిన లక్కీ భాస్కర్, క, అమరన్, ఖుషిర వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో ఖుషీర చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.


ఒక్కో ఏరియాలలో ఒక్కో సినిమా అవా చూపిస్తూ ఉన్నది. అలా శని ఆదివారాలలో కలెక్షన్స్ కూడా బాగానే అందుకున్నాయట. క, లక్కీ భాస్కర్ చిత్రాలకు. మొదట క సినిమాకి సరైన థియేటర్లు దొరకకపోవడంతో మెల్లమెల్లగా ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా చేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అమరన్ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెంట్స్ దగ్గర పడిందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కిరణ్ అబ్బవరం కూడా ఇంతటి కలెక్షన్ తన కెరియర్లో ఎప్పుడూ చూడలేదు అనే విధంగా ఆనందపడుతూ ఉన్నట్లు సమాచారం. ఈ మూడు చిత్రాలు కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చని చెప్పవచ్చు.


ఈ చిత్రాలు అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి అసభ్యతకు తావు లేకుండానే.. క , అమరన్  చిత్రాలతో పోలిస్తే లక్కీ భాస్కర్ చిత్రాలకు కాస్త ఎక్కువగానే థియేటర్లు దక్కయ్య అనే వార్తలు వినిపిస్తున్నాయి. లక్కీ భాస్కర్ సినిమాకు తమిళ మలయాళం లో కూడా బాగానే కలెక్షన్స్ రాబడుతున్నాయట. మొత్తానికి దీపావళికి విడుదలైన ఈ చిత్రాలు అన్నీ కూడా టపాసుల పేలుతున్నాయి.. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాయి ఎలాంటి రికార్డులను తిరగ రాస్తాయో చూడాలి మరి. మొత్తానికి దీపావళి పండుగ విన్నర్ ఎవరనే విషయం కలెక్షన్స్ను బట్టి తెలియబోతోంది.ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోజురోజుకి కలెక్షన్స్ కూడా పనిచేస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: