ఇక అలాగే మ్యాన్ ఆఫ్ మస్ ఎన్టీఆర్ విషయానికొస్తే దేవర సినిమాతో పాన్ ఇండియా హీరోల సినిమాలకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ లో పగా వెయ్యడానికి చూస్తున్నాడు. మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన రేంజ్ మారిపోయింది. పుష్ప2 తో ఇప్పుడు దుమ్మురేపాలని రికార్డులు బద్దలు కొట్టాలని తన టార్గెట్ గా పెట్టుకున్నాడు. మరో స్టార్ హీరో దళపతి విజయ్ విషయానికి వస్తే మన భారతదేశంలోనే 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఒకే ఒక్క హీరో విజయ్. అలాగే విజయ్ తో సినిమా అంటే తమిళ డైరెక్టర్లకు పెద్ద ఛాలెంజ్. అయితే ఇప్పుడు ఈ నలుగురు హీరోల్లో ఓ కామన్ పాయింట్ ఉంది.
వీరు సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళ లుక్స్ గురించి ఎన్నో కామెంట్లు వచ్చేవి. చూడ్డానికి అందంగా లేరని చిత్ర పరిశ్రమలో ఉన్నవారు వీరుపై కామెంట్లు చేసేవారు. అయితే విజయ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో నల్లగా ఉండేవాడు. ఆ టైం లో అతని గురించి తమిళ జనాలే కామెంట్ చేసారు. ఇక ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా టైం లో చాలా కామెంట్స్ చేసారు. రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లుక్స్ ను ఆడియన్స్ కూడా కామెంట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ విషయానికి వస్తే అప్పట్లో చాలా లావుగా ఉండేవాడు. ఆ టైం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి… అసలు హీరోగా పనికిరాడు అంటూ ఓ వర్గం బాగా టార్గెట్ చేసారు. ఇక అల్లు అర్జున్ గంగోత్రి సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు. ఇలా ఒకప్పుడు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నఈ నలుగురు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ కు దిక్కు అయ్యారు.