త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల క్రితం తన హవాను కొనసాగించింది. నాలుగుపదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆరు సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. త్రిషతో పాటు ఇండస్ట్రీకి ఎంత ఇచ్చిన హీరోయిన్లందరూ పక్కకు తప్పుకుంటే ఈ బ్యూటీ మాత్రం ఇప్పటికీ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది.


41 సంవత్సరాల వయసులోనూ అంతే అందం, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంది. వయసు పెరిగే కొద్దీ ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా ఈ బ్యూటీ రీసెంట్ గా విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ సినిమాలోను నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.


ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే.... త్రిష ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. గతంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోవాలని అనుకున్న ఈ చిన్నది అనివార్య కారణాల వల్ల బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు త్రిష ఒంటరిగా తన జీవితాన్ని సాగిస్తోంది. తమిళ హీరో విజయ్ తో ఈ బ్యూటీ ఎఫైర్ నడిపిస్తుందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.


వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కాగా త్రిషకు ఓ రాజకీయ నాయకుడు ఓ ఖరీదైన ఫ్లాట్ ను గిఫ్ట్ గా రాసిచ్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రాజకీయ నాయకుడు విజయ్‌ అని అంటున్నారు. మరి ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్తలో ఏ మేరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: