నందమూరి బాలకృష్ణ సినిమాలో ఎంత సీరియస్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడో బయట అంతే సరదాగా ఉంటూ జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. ఆయన సరదాగా ఎలా ఉంటాడు అనేది ఇంత కాలం పాటు చాలా మందికి తెలియదు. కొంత కాలం క్రితమే బాలకృష్ణ హోస్ట్ గా అహ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు ఆన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో ను ప్రారంభించారు. ఇక ఈ టాక్ షో ద్వారా బాలకృష్ణ బయట ఏవిధంగా ఉంటారు .. ఎలా మాట్లాడుతారు .. ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు అన్నీ కూడా జనాలకు తెలిసాయి. ఎక్కువ శాతం బాలకృష్ణ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.

తాజాగా లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ ఆన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ లుగా వచ్చారు. ఇక లక్కీ భాస్కర్ సినిమాలో హీరో గా నటించిన దుల్కర్ సల్మాన్ తో బాలకృష్ణ సరదాగా మాట్లాడారు. ఇక బాలకృష్ణ , దుల్కర్ సల్మాన్ తో మాట్లాడుతూ ... నేను మా తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశాను. మరి నువ్వు మీ తండ్రి అయినటువంటి మమ్ముట్టి తో ఎందుకు సినిమాలు చేయలేదు ... ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. దానితో అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అని దుల్కర్ సమాధానం ఇచ్చాడు.

దానితో బాలకృష్ణ నువ్వు నేను మరియు నా కుమారుడు మోక్షజ్ఞ కలిసి నటించే విధంగా ఉండే ఒక కథను తయారు చేయి , నేను నువ్వు మీ నాన్న కలిసి నటించే విధంగా స్కోప్ ఉన్న ఒక కథను తయారు చేస్తాను అని సరదాగా అన్నాడు. ఇకపోతే అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన లక్కీ భాస్కర్ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: