టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్నేళ్ల క్రితం తన సినిమాలు, అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో పరిచయమైంది ఈ చిన్నది. అనంతరం పోకిరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఇలియానాకు వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.



ఇలియానా పుట్టి పెరిగింది గోవాలోనే. 2003లో మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది పలు యాడ్స్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకుంది.


రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన చేసింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. హిందీలో సినిమాలు చేసినప్పటికీ ఇలియానాకు కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అనంతరం మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వచ్చింది. కానీ అప్పటికే ఈ బ్యూటీ క్రేజ్ తగ్గిపోయింది. 2018లో రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.


ఇక 2023 మే నెలలో ఇలియానా మైకేల్ డోలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆగస్టు నెలలో ఈ దంపతులకు ఒక మగ బిడ్డ పుట్టాడు. కాగా, ఇలియానా వివాహానికి ముందే గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే ఓ స్టార్ హీరో ఇలియానాను వాడుకొని వదిలేసాడట. ఈ విషయాన్ని ఇలియానా ఎక్కడా కూడా బయట పెట్టలేదు. ఈ విషయాన్ని ఇలియానా సన్నిహితులు చెప్పడం జరిగింది. కానీ ఆ హీరో ఎవరు, ఏంటి అనే విషయాలు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: