ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతెంత భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకోవడం కోసం డబ్బును వెనకాడకుండా నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు . అయితే అంత కోట్లు ఖర్చుపెట్టి సినిమాను నిర్మించిన ఆ సినిమా హిట్ అవుతుందా..? అంటే అసలు లేదని చెప్పాలి .ఎన్నో ఎన్నో బడా పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పేలిపోయాయి . పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా జనాలు లైక్ చేయకుండా పోవడం గమనార్హం .


పెట్టిన డబ్బులు మొత్తం కూడా నష్టమే రావడంతో మేకర్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. రీసెంట్గా దీపావళి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి . దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన "లక్కీ భాస్కర్".. అదేవిధంగా శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన "అమరన్" మూవీ అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఎంతో ఇష్టంగా కష్టపడి నటించినా "క" సినిమా . మూడు కూడా దీపావళి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకున్నాయి.



మరీ ముఖ్యంగా ఈ మూడు సినిమాల్లో అన్నిటికన్నా బాగా "క" సినిమా పాజిటీవ్ టాక్ దక్కించుకుంది . చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన.. ఈ సినిమా డబుల్ ప్రాఫిట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేస్తుంది . లక్కీ భాస్కర్ కూడా అంతే . చాలా చిన్న బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక అమరాన్ మూవీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది . ఈ మూడు సినిమాలు కూడా చాలా చాలా చిన్న బడ్జెట్లో తెరకెక్కాయి.  సినీ తారల రెమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ . అయితే సినిమాలో కధా.. కంటెంట్ ఉంటే అది ఎంత తక్కువ బడ్జెట్ సినిమా అయినా సరే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు అన్నదానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. కోట్లు ఖర్చుపెట్టినా సినిమా కథ లేకపోతే ఫ్లాప్ అయిపోయాయి.  చిన్న బడ్జెట్ అయినా సరే పర్ఫెక్ట్ స్టోరీ ఉంటే కచ్చితంగా హిట్ అవుతాయి అంటూ జనాలు ప్రూవ్ చేశారు . ఇకనైనా బడా డైరెక్టర్ ..ప్రొడ్యూసర్స్.. హీరోలు కథపై కాన్సెప్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: