మొదట ఈ జాబితాలో కార్తికేయ2 గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లకు సంబంధించి జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. నిఖిల్ సైతం తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్లను పదేపదే మార్చాలని ఫోర్స్ చేయడంపై నిఖిల్ ఒకింత ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఆ సమయంలో ఒక పొలిటీషియన్ హెల్ప్ నిఖిల్ కు ప్లస్ అయింది. సింపతీ ఫ్యాక్టర్ కార్తికేయ2 కు ప్లస్ కావడంతో పాటు నార్త్ లో సైతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టింది.
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో హనుమాన్ సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్ లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది. అయితే థియేటర్ల గురించి, జరుగుతున్న అన్యాయం గురించి మేకర్లు ఆవేదన చెందడం హనుమాన్ కు ప్లస్ అయింది. హనుమాన్ సినిమా గుంటూరు కారం సినిమాను మించి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
తాజాగా క సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కావడం సినిమాకు ప్లస్ అయింది. క సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. రెండు రోజుల కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా మేకర్స్ కు మంచి లాభాలను అందించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క సినిమా సక్సెస్ టాలీవుడ్ లో మరిన్ని చిన్న సినిమాలను తెరకెక్కించడానికి ప్రొత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.