డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా హీరోల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ 90లలోనే పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపుని సంపాదించుకున్నారు. తెలుగులో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టడమే కాదు.. అటు బాలీవుడ్లో సైతం పలు సినిమాలతో అక్కడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. అప్పట్లో ఆర్జివి దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది .


 ఇక ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంతే చాలు ఇక ఇండస్ట్రీలోని అన్ని సినిమాలు కూడా భయపడిపోయి వెనకడుగు వేసేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రాంగోపాల్ వర్మ ఇక ఇప్పుడు మాత్రం చిత్ర విచిత్రమైన సినిమాలు తీస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు రాంగోపాల్ వర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఒక వ్యక్తి రాంగోపాల్ వర్మను ఫుల్లుగా తాగి నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టాడట.


 అయితే ఇలా తిట్టింది ఎవరో కాదు ఏకంగా అతని అభిమానే.  రాంగోపాల్ వర్మ తీసిన సినిమా నచ్చకపోవడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఫుల్లుగా తాగి వర్మకి ఫోన్ చేసి బూతులు తిట్టాడట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఇక అన్ని విషయాలను బయటపెట్టేసి రాంగోపాల్ వర్మే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే ఇలా రాంగోపాల్ వర్మను ఫుల్లుగా తాగి బండ బూతులు తిట్టింది ఎవరో కాదు ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి. అయితే అజయ్ భూపతి రాంగోపాల్ వర్మ అభిమాని మాత్రమే కాదు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాడు. స్ట్రేయిట్ ఫార్వర్డ్ గా ఉండే మనుషులను ఎక్కువగా ఇష్టపడే రాంగోపాల్ వర్మ అజయ్ భూపతి తిట్టినప్పుడు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv