పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ హిట్టు కొట్టడానికి చాలా సమయమే పట్టింది. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.


 అయితే ఈ మూవీకి సీక్వల్ ఉంటుందని అటు అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోయారు. కానీ ఆ తర్వాత సీక్వెల్ క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అటు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది అంటూ మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో ముంగిపోయారు. అయితే ఇక ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ లేకుండానే సలార్ 2 షూటింగ్ జరుగుతుందట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సలార్ 2 షూట్లో కేవలం చిన్నారులతో కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారు.


 ప్రశాంత్ నీల్ లేకుండానే ఈ సీన్లు షూట్ చేసినట్లు తెలుస్తోంది. తన అసిస్టెంట్ కి ఈ బాధ్యతలను అప్పగించాడట డైరెక్టర్ ప్రశాంత్. అయితే సలార్-2 లాంటి భారీ ప్రాజెక్ట్ ని ఇలా దర్శకుడు లేకుండా సన్నివేశాలు చిత్రీకరించడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏదైనా తేడా కొడితే చివరికి నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తాయని.. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. కాగా ఒక వైపు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి సినిమాలపై ఫోకస్ పెట్టగా.. ఇంకోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ చిత్రానికి కమిట్ అయ్యాడు. దీంతో సలార్-2 పై ఫుల్ గా ఫోకస్ చేయడం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: