బిగ్ బాస్ షోలో నటి శిల్ప శిరోద్కర్ కూడా అక్కడ ఉండటం జరిగింది. ఇక ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు చెల్లి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పను బిగ్ బాస్ హస్ లోకి అడుగుపడటం పట్ల మహేష్ బాబు తో పాటు తన ఫ్యామిలీ ఎలా స్పందించింది అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఈ క్రమంలో తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం అని ఇది తన కల నెరవేరిన అద్భుతమైన క్షణం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన ప్రయాణం పట్ల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందంటూ శిల్ప ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తాను బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నాను అని తెలియగానే నమ్రత - మహేష్ ఎంతో సంతోషించారని తన ప్రయాణం గురించి గర్వపడుతున్నారని కూడా చెప్పుకొచ్చింది.
ఈ 'షో ద్వారా నేను వారిని గర్వపడేలా చేస్తాను' అని శిల్పా మాటి ఇచ్చింది. దీంతో మహేష్ అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో #శిల్పా శిరోద్కర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసారు. ఇదిలా ఉంటే శిల్పా తన సోదరి నమ్రతను చూడాలనే కోరిక వ్యక్తం చేసింది. కరణ్ వీర్ మెహ్రాతో శిల్పా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం షేర్ చేయటం జరిగింది. తాను బిగ్ బాస్ లో కి ప్రవేశించే ముందు తన చెల్లిని కలవలేదని చెప్పుకొచ్చింది. నమ్రత వేరే పనుల్ల తో బిజీగా ఉండటంతో ఆమె తనకు బిగ్ బాస్ కు వెళ్తూంటే వీడ్కోలు చెప్పటం కుదరలేదని అందుకే ఇప్పుడు తన చెల్లిని చూడాలని ఉందని అంది. తాను బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో నమ్రతను కలవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె అభిమానులు సైతం ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీని కలవాలని ఎవరికైనా ఉంటుందని, శిల్పా కోరికలో తప్పు లేదని అంటున్నారు. ఈ క్రమంలో నమ్రత కూడా ఈ షోకు ఫ్యామిలీ వీక్ లో వెళ్లే అవకాసం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం లేదు.