కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన ప్రశాంత్ నీల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. కే జి ఎఫ్ చిత్రాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ సినిమాతో మరింత క్రేజీని అందుకున్నారు. అందుకే చాలామంది ఈ డైరెక్టర్ తో సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకాన్ని అందుకున్నారు. ఎవరైనా క్రేజీ డైరెక్టర్ కథ ఇచ్చారు అంటే కచ్చితంగా ఆ సినిమాకి మంచి హైప్ వస్తుందని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే బఘిర సినిమాకి కూడా ఏర్పడింది.. కన్నడ హీరో శ్రీమురళి నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


దీపావళికి విడుదలైన ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అందించారు.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిం బ్యానర్ పైన కూడా నిర్మించారు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కథక్ అందించారు కాబట్టి ఈ చిత్రానికి భారీగానే ఖర్చుపెట్టినట్లుగా సమాచారం. దీపావళికి విడుదలైన ఈ సినిమా రెస్పాన్స్ కూడా పెద్దగా అందుకోలేదని సమాచారం.


స్టోరీ విషయానికి వస్తే.. బఘిర అనే ప్రాంతంలో హీరోకు సూపర్ హీరోలు అంటే చాలా ఇష్టమని తాను కూడా అలాగే మారాలనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తల్లి చెప్పిన మాటలను విని పోలీస్ అవుతారు.. అలా క్రిమినల్ ను అంతం చేస్తున్న సమయంలోనే హీరోకు తన తండ్రి ఉద్యోగం కోసం లంచం ఇచ్చారని తెలియడంతో అప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు హీరో.. అదేమిటంటే పగలు పోలీసుగా నైట్ సూపర్ హీరోగా మారి క్రిమినల్స్ ని అంతం చేస్తూ ఉంటారు.


సినిమా స్టోరీ కూడా కొత్తగా అనిపించలేదని సినిమా అంతా కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన గత చిత్రం లాగే కనిపిస్తూ ఉన్నాయట. అలాగే డైరెక్టర్ సూరి స్క్రీన్ ప్లే తో పాటు సినిమా అంతా కూడా సాగదీతగా అనిపించిందని.. విలన్ పాత్ర ఆకట్టుకున్నప్పటికీ చివరి వరకు మాత్రం సాగదీత గానే మిగిలిపోయిందట. హీరో మురళి మాత్రం తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ కథలో దమ్ము లేదు.. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కు ఈ సినిమా ఖచ్చితంగా ఒక గుణపాఠం లాంటిదని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: