స్టార్ హీరో అంటే కేవలం నటించడం మాత్రమే నా..? మిగతావి కూదా ఉంటాయి.  మిగతా పనులు చేయకూడదా..? అంటే నో అని చెప్పాలి.  ఒక నటుడికి ఎన్నెన్నో టాలెంట్స్ ఉంటాయి . అందరు అని చెప్పుకోరు. అవి సమయానుసారం బయటపడుతూ ఉంటాయి. కొందరు డ్యాన్స్  బాగా చేస్తారు . మరికొందరు పాటలు బాగా పాడతారు . మరికొందరికి డైరెక్షన్ చేసే టాలెంట్ ఉంటుంది. ఇలా చాలా చాలా హిడెన్  టాలెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి .


మన ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కి అయితే ఇప్పటివరకు మనం చాలా తక్కువ మంది స్టార్స్ సినిమాలో పాటలు పాడడం చూసాం . తాము నటించిన సినిమాల్లో తమ వాయిస్ కి తమే పాట పాడుకోకుండా హీరోస్ చాలా తక్కువ . తారక్ - సిద్ధార్ధ్ ఆ లిస్టులో ముందు వరుసలో ఉంటారు.  అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా మృగరాజు సినిమాలో ఒక పాట పాడాడు . సినిమా ఫ్లాప్ అయిన ఆ పాట బాగా హిట్ అయ్యింది.



అయితే రామ్ చరణ్ ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలలో ఏ పాట పాడలేదు . కానీ తండ్రి కోసం ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక పాట పాడాడు . ఆ పాట చాలా చాలా హిట్ అయింది . చరణ్  తన కెరీర్లో ఏ సినిమాకి సాంగ్ పాడలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించిన కొత్తల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక పాటను పాడారు.  ఈ సాంగ్ ని మణిశర్మ కంపోజ్ చేయడం గమనార్హం. చాలా కాలం తర్వాత ఈ పాట మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనితో ఈ విషయం బాగా వైరల్ గా మారింది . అయితే ఈ పాట ఎప్పుడు చరణ్ పాడిన సరే బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది సురేఖ. మెగా ఫ్యామిలీ కూడా . ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో  చిరంజీవిపై చెప్పులు , రాళ్లు కూడా విసిరిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుందట మెగా ఫ్యామిలీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: