అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాల తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారు. ముఖ్యం గా నాగార్జున కెరియర్ లో చేసిన అన్నమయ్య శ్రీరామదాసు లాంటి సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏకంగా ఎవర్గ్రీన్ మూవీస్ గా నిలిచి పోయాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.


 ఇక ఇప్పుడు ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఇంకోవైపు బిగ్ బాస్ లాంటి షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ స్పీడ్ లో దూసుకు పోతున్నారు నాగార్జున. అయితే కింగ్ నాగార్జున బాల్యం గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయాయి. తను చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అనే విషయాన్ని నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. నాగార్జున స్కూలింగ్ అంత కూడా చెన్నైలో జరిగిందట. ఇక అందరిలో నాగార్జుననే చిన్న వాడట. ఇక చిన్నప్పుడు నాగార్జున ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు.


 ఇక తండ్రి అక్కినేని నాగేశ్వర రావు ఇంట్లో ఉన్నంత సేపు రాముడు మంచి బాలుడు అన్న రీతిలో ఎంతో సైలెంట్ గా ఉండేవాడట. కానీ ఇక వాళ్ళు వెళ్లి పోయిన తర్వాత తన విశ్వరూపం చూపించేవాడట. ఇంట్లో అన్న వెంకట్ అక్క సుశీల తమ పనులు చేయించు కోవడానికి నాగార్జునను బాగా వాడుకునేవారట. చేయక పోతే ఏకంగా బాగా కొట్టేవారట. తర్వాత ఇంటికి నాగేశ్వర వచ్చిన తర్వాత వాళ్ళపై కంప్లైంట్ కూడా ఇచ్చేవాడట నాగార్జున. యాంకర్ ప్రదీప్ తో గతంలో కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షోలో పాల్గొన్న నాగార్జున.. ఈ విషయాన్ని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: