పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత సినిమాలపై కూడా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫోకస్ చేస్తున్నారు. పుష్ప 2 హిట్ అయితే మాత్రం బన్నీ రేంజ్ మరో స్థాయికి వెళుతుంది. అలాగే 1000 కోట్లు టార్గెట్గా పెట్టుకుని మేకర్స్‌ ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు కూడా పెడుతున్నారు. మన సౌత్ లో అన్ని భాషాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ లో అమెరికా , ఆస్ట్రేలియాలో కూడా భారీగా ప్రమోషన్స్‌ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5 న‌ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ సినిమాలో ఐటెంసాంగ్  కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని టాక్.. అలాగే ఆ పాటకు సంబంధించిన హీరోయిన్ ఇంకా ఫైనల్ చేయలేదని కూడా అంటున్నారు.


ఇక శ్రద్ధా కపూర్ కాస్త రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడంతో మరోసారి ఆలోచనలో పడ్డారని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రెండు సినిమాలు ఫైనల్ అయ్యాయి అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగ మూవీ కాగా రెండోది త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తెలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి జనవరిలో పూజా కార్యక్రమాలు ఉంటాయని కూడా అంటున్నారు.. అలాగే ప్రోమోను కూడా రిలీజ్ చేస్తామని నిర్మాత నాగు వంశీ ఇప్పటికే ప్రకటించారు. అలాగే అదే సమయంలో నాగు వంశీ మరో కీలక ప్రకటన కూడా చేశారు.


అలాగే మరో స్టార్ హీరోతో ఓ భారీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నామని కూడా ప్రకటించారు. దీంతో బన్నీతో ఆ పొలిటికల్ మూవీ అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే కనుక నిజమైతే త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక నిర్మాత మాట్లాడిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు అభిమానులు అంచనాలు పంచేస్తున్నాయి. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. పుష్ప 2 అయిపోగానే ఈ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తామన్నారు. జనవరిలో స్పెషల్‌ ప్రోమోతో సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేస్తామన్నారు. మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని… మార్చిలోనే అల్లు అర్జున్‌ షూటింగ్లో పాల్గొంటారు అని ప్రకటించారు. ఇప్పటి వరకు జక్కన్న ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆయన కూడా టచ్‌ చేయని జానర్‌లో త్రివిక్రమ్ బన్నీ సినిమా ఉంటుంది అన్నారు. మరి ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమానా కాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: