మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు అర్ధరాత్రి నుంచి టికెట్ల కోసం క్యూలో నిలుచునేవారు. ఇక అప్పట్లో చిరంజీవి సినిమా చూసేందుకు టికెట్ల కోసం ఎంతో కష్టపడి శ్రమించే వారో తెలిసిందే. ప్రధానంగా చిరంజీవి అంటే అభిమానులకు గుర్తుకొచ్చి మాస్ డైలాగ్స్ , డాన్స్ , ఫైట్లు వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా ఒప్పుకునే వారు కాదు.. ఇవి లేకుండా సినిమా కోసం చిరంజీవి ప్రాణం పెట్టి పనిచేసిన దాన్ని పట్టించుకోకుండా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చేసేవారు. అలా భారీ  స్లాప్ అయిన‌ సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ కూడా ఒకటి.

చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ 2005లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది . అయితే ఇది బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ ఎంబిబిఎస్ కి రీమేక్ గా తెలుగులో వచ్చింది .. అయితే ఈ సినిమాలో చిరంజీవి తన మార్క్‌ కామెడీ కమర్షియల్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించారు. అయితే 2007లో ఈ సినిమాకి సీక్వల్ గా మున్నాభాయ్ జిందాబాద్ కి రీమేగా వ‌చ్చిన‌ శంకర్ దాదా జిందాబాద్ గాంధీ గిరి అంటూ అహింస అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. అయితే ఇందులో మాస్‌ హీరో ఇమేజ్ ఉన్న చిరంజీవితో శాంతి ప్రవచనాలు చెప్పించడ‌మే కాకుండా చిరంజీవిని ఒక మానసిక రోగగా కూడా చూపించారు .


అయితే ఈ సినిమాలోని పాయింట్ అభిమానులకు అసలు ఎక్కలేదు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్‌ గా మిగిలింది.  ఈ సినిమాని చేయవద్దని ర‌చ‌న‌త‌లు పరిచూరి గోపాల  కృష్ణ ముందుగానే చిరంజీవికి ఓ సలహా ఇచ్చారట. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్ గా పని చేశారు.  సినిమా స్టార్టింగ్ లోనే పరుచూరి చిరంజీవి తో సినిమా వద్దని చెప్పారట . మీ బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ ఆస‌లు అంతగా సెట్ కాదని .. మాస్ డైలాగ్స్ చెప్పే మీరు శాంతి వచనాలు చెబుతుంటే ఆడియన్స్ అంగీకరించలేరని చెప్పారట . కానీ చిరంజీవి వాటిని పట్టించుకోకుండా సినిమా చేశారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈమూవీకి దర్శకత్వం వహించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: