స్టార్ హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరోగా తెలుగులో, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. తన అద్భుతమైన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. ఒకప్పుడు సిద్దార్థ్ నటించిన లవ్ మూవీస్ చూడటానికి యూత్ థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. ప్రస్తుతం సిద్దార్థ్ యాక్టింగ్ బేస్డ్ మూవీస్ ఎంచుకుంటూ తనదైన శైలిలో నటించి మెప్పిస్తున్నాడు.. అయితే హీరోగా అద్భుతంగా రానిస్తున్న సిద్దార్థ్ కెరీర్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైంది.. తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్' సినిమాకు సిద్ధార్థ్ అసోసియేట్ గా పని చేశారు. అదే చిత్రం తెలుగులో 'అమృత' పేరుతో డబ్బింగ్ అయ్యి మంచి విజయం సాధించింది..రచయిత సుజాత ప్రోత్సాహంతో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హీరోగా సిద్దార్థ్ కెరీర్ కి బాగా ఉపయోగపడింది..ఆ సినిమా తరువాత  సిద్దార్థ్ తెలుగులో, తమిళ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు..అయితే బాయ్స్ సినిమా సమయంలో జరిగిన విషయం ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటారు. 

శంకర్ సినిమా అంటేనే చిన్న సీన్ కూడా గ్రాండ్ గా రిచ్ గా తీయాలనీ చూస్తారు.. దీనితో నిర్మాతలకు తడిసి మోపిడవుతుంది.. వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగిందానికి ఎదురు చెప్పరు.. దీనితో శంకర్ ప్రొడ్యూసర్ డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిస్తు వుంటారు..శంకర్ ఖర్చు పెట్టడం అనేది ఎలా ఉంటుందంటే బాయ్స్ చిత్రంలో సిద్ధార్ద హీరోయిన్ జెనీలియా ప్రేమ కోసం న్యూడ్ గా రోడ్లవెంట పరిగెట్టే సీన్  ఒకటి ఉంది.ఆ సీన్ కోసం చెన్నైలోని మౌంట్ రోడ్ వేల రూపా యలు వెచ్చించి మరీ దానిని బ్లాక్ చేశారు. ప్రతి రోజు 2 గంటల నుంచి 6 గంటల వరకు ఏకంగా 15 రోజులు బ్లాక్ చేసినందుకు గాను దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయిందట.. అంతే కాదు సీన్ లో ట్రాఫిక్, పబ్లిక్ సహజత్వం కోసం జూనియర్ ఆర్టిస్టుల్ని అలాగే వందల కొద్దీ వాహనాల్ని అద్దెకు తీసుకున్నాడట. దీనితో ఆ ఒక్క సీన్ మొత్తం ఖర్చు కోటి రూపాయలు పైగా అయినట్లు సమాచారం... చిన్న సీన్ కోసం శంకర్ ఈ రేంజ్ ఖర్చు పెట్టించాడంటే మాములు విషయం కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: