టాక్ తో సంబంధం లేకుండా సినిమాను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులంత గొప్పవారు ఎవరూ ఉండరు. కానీ ఇక్కడే ఒక సమస్య ఇప్పుడు వెంటాడుతోంది. అదేమిటంటే, తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ కూడా పరభాష చిత్రాలు విడుదలయితే అది తెలుగు సినిమాలను దెబ్బేసేలా కనిపిస్తోంది. ఇది కలెక్షన్ పైన కూడా ప్రభావం చూపిస్తోందట. ఈ పండుగ సీజన్లో లక్కీ భాస్కర్, క రెండు చిత్రాలే విడుదలయితే పరిస్థితి మరొక లాగ ఉండేది. అమరన్ సినిమా విడుదల కాకపోయి ఉంటే కలెక్షన్స్ ఈ రెండు చిత్రాలను షేర్ చేసుకునేవనీ కూడా చెప్పవచ్చు. కలెక్షన్స్ గ్రోత్ కూడా కాస్త పెరిగేవి.
తెలుగు చిత్రాలను ఇతర భాష చిత్ర నిర్మాతలు సైతం అడ్డుకుంటున్నారట. క సినిమాను తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అడ్డుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. క సినిమా దీపావళికి తమిళంలో విడుదలవుతున్న సినిమాలకు అడ్డుగా వస్తుందని తమిళంలో క చిత్రాన్ని విడుదల చేయలేదట. అక్కడ థియేటర్లు పండుగలకు తమ సినిమాలని విడుదల చేయాలని డబ్బింగ్ సినిమాలకు అడ్డుకట్టు వేయాలని తెలియజేస్తూ ఉంటారు. తమిళనాడులో తమిళ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు తెలుగులో మాత్రం అలాంటి రూల్ ని తీసుకురాలేదు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. మరి ఈ విషయం పైన అటు నిర్మాతలు ఒకసారి ఆలోచిస్తారేమో చూడాలి మరి.