ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించారు. 2022లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మంచి సక్సెస్ అందుకొని తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసింది. అంతేకాదు విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ కొన్ని దేశాలలో ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. జపాన్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ జనాలని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి వారి ఫ్యామిలీ లతో కలిసి అక్కడికి వెళ్లి మరీ ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్లో ప్రమోట్ చేశారు. అంతగా అక్కడి ప్రజలకు కనెక్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన ఈ సినిమా మేకర్స్ నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికర అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణి ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. మెయిన్ గా తన సాంగ్ నాటు నాటు పాటకు ఆస్కార్ లభించడమే కాదు ఆస్కార్ స్టేజి మీద పెర్ఫార్మెన్స్ కూడా చేశారు. ఇప్పుడు 2025 లండన్ లో ఒక ఎపిక్ షో అయితే కీరవాణి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో కీరవాణి ఆర్.ఆర్.ఆర్ సంగీతాన్ని లైవ్లో ఆలపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ బుకింగ్స్ ని కూడా ఓపెన్ చేయగా ఆర్ఆర్ఆర్ స్కోర్స్ ని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే బుక్ చేసుకుని రావచ్చని కూడా తెలిపారు. ఈ లైవ్ ఆర్కెస్ట్రా 2025 మే 11న జరపనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.