మరోవైపు తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి కూడా కాస్త సమయం ఇవ్వాలని అనుకున్నారో ఏమో అందులో భాగంగానే ఆయన గతంలో అనౌన్స్ చేసి వదిలేసిన ప్రాజెక్టులను ఇప్పుడు మళ్లీ త్వరగా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం అవ్వగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ కాంబో పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక రూమర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను పిలిపించి మరీ ఒక డిమాండ్ పెట్టారట. ఏమిటా డిమాండ్ అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ కావాలి అంటే , అభిమానులు మెచ్చుకోవాలి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కొన్ని మార్పులు చేయాలి అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్త వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం హరీష్ ని పిలిపించిన పవన్, స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించారట. ఇప్పుడు హరీష్ కూడా ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా స్టార్ట్ చేద్దామని డైలాగ్ వర్షన్ తో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని పవన్ కళ్యాణ్ డెడ్లైన్ పెట్టినట్లు సమాచారం.
ఒకవేళ తాను చెప్పినట్టు చేస్తే ఫుల్ డేట్స్ ఇచ్చి మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారట. దీంతో హరీష్ శంకర్ కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ బ్యాండ్ బాజా తో కాస్కోండి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.