యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో భారీ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఒకప్పుడు హాట్రిక్ ప్లాప్స్ తో ఎన్టీఆర్ ఎంతగానో ఇబ్బందిపడ్డాడు.. బృందావనం సినిమా తరువాత వచ్చిన శక్తి మూవీ నుంచి ఎన్టీఆర్ కి వరుస ప్లాప్స్ వచ్చాయి.. ఒకానొక దశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు వున్నాయి.. శక్తి, ఊసరవెల్లి వంటి వరుస ప్లాప్స్ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిన కాంబినేషన్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్.. బాలయ్యతో సింహా వంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటితో ఎన్టీఆర్ సినిమా కమిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాకి ‘దమ్ము’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి..సింహాద్రి తరువాత ఎన్టీఆర్ ని పక్కా మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన సినిమా ‘దమ్ము’.. అయితే ఈ సినిమా కథ పాతదే అయినా బోయపాటి ఎన్టీఆర్ సినిమా విషయంలో కొన్ని కీలక తప్పులు చేసారు..

యాక్షన్ ఎపిసోడ్స్ ఒక ఎత్తయితే హీరోయిన్స్ విషయంలో పెద్ద పొరపాటే జరిగింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీకా నాయర్ హీరోయిన్స్ గా నటించారు.. ఫస్ట్ హాఫ్ వరకు త్రిష బాగానే మెప్పించిన సెకండ్ హాఫ్ లో వచ్చే కార్తీకా క్యారెక్టర్ మాత్రం విసుగు తెప్పిస్తుంది.. సీనియర్ హీరోయిన్ రాధ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తీకా జోష్, రంగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది…తన కూతురు స్టార్ హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో రాధ జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరీ బ్రతిమలాడుకున్నట్లు సమాచారం.. తమ సినిమాలో కార్తీకాను హీరోయిన్ గా తీసుకోవాలని ఆమె ఎన్టీఆర్ ని బాగా రిక్వెస్ట్ చేశారట.. దీనితో రాధ రిక్వెస్ట్ కాదనలేక బోయపాటికి కార్తీకా గురించి చెప్పి ఒప్పించారని సమాచారం.. ఎన్టీఆర్ చేసిన పెద్ద తప్పు అదే.. కార్తీకా ఎన్టీఆర్ కన్నా కాస్త హైట్ గా కనిపించడం సినిమాకు మైనస్ అయింది.. అలాగే ఏ మాత్రం సెట్ కానీ పాత్రలో కార్తీకా కనిపించడంతో ఆ ప్రభావం సినిమాపై పడినట్లు అయింది..సినిమా కథలో బలం వున్నా కూడా బోయపాటి సినిమా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని అప్పట్లో న్యూస్ తెగ వైరల్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: