-భారీ అంచనాలతో వచ్చిన వరుడు..
- అల్లు అర్జున్ ఇమేజ్ డ్యామేజ్..
- ముసుగు వేసుకున్న ఫలితం లేదుగా..

 అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన మూవీలలో వరుడు మూవీ ఒకటి. ఈ సినిమాతోనే అల్లు అర్జున్  కి పెళ్లి మీద కోరిక పుట్టింది అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమాలో లాగా ఐదు రోజుల పెళ్లి అల్లు అర్జున్ చేసుకున్నారని ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కారణంగా సినిమాకి పెద్ద మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ముసుగు వేసుకొని హీరోయిన్ ని ఎంత గుట్టుగా మెయింటైన్ చేసినా కూడా చివరికి  హీరోయిన్ కారణంగా సినిమాకి ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పుకోవచ్చు. ఉపయోగం లేకపోగా పెద్ద మైనస్ అయిందని చెప్పుకోవచ్చు.. మరి ఇంతకీ భాను శ్రీ వల్ల సినిమాకి ఎలాంటి నష్టం వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

 ముసుగు వేసుకున్నా నో యూజ్:

 సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు గుణశేఖర్ కి ఎంతమంచి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. ఈయన డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి ఈ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2010 మార్చి 31న  భారీ తారాగణంతో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన వరుడు మూవీ కమర్షియల్ ప్లాఫ్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా కొత్త హీరోయిన్ భాను శ్రీ మెహ్రాని తీసుకున్నారు. అలాగే విలన్ గా తమిళ నటుడు ఆర్య ని తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ గా హీరోయిన్ భాను శ్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా విడుదల కాకముందు ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్,గ్లింప్స్,ట్రైలర్, టీజర్ ఎందులో కూడా ఈ హీరోయిన్ ఫేస్ ని చూపెట్టలేదు.


అలాగే హీరోయిన్ గురించి బన్నీ ఫ్రెండ్స్ అడిగినా కూడా రివీల్ చేయలేదు. కానీ సడన్గా సినిమా చూసిన అభిమానులకి హీరోయిన్ అంతగా నచ్చలేదు. కొత్త హీరోయిన్ అయినప్పటికీ డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ఈ సో కాల్డ్ ప్రయోగం సక్సెస్ అవ్వలేదు. అలా హీరోయిన్ కి ముసుగేసి చూపించి ఆమెని సస్పెన్స్ లో పెట్టినప్పటికీ సినిమా చూసిన జనాలకి భాను శ్రీ మెహ్రా నచ్చలేదు. దాంతో సినిమా ప్లాప్ కి హీరోయిన్ కూడా కారణమైంది. ఇక మరో విషయం ఏమిటంటే సినిమా కథాంశం కూడా చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే ఈ కథ అందరూ ఊహించే విధంగానే ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు.అంతేకాకుండా ఇందులో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా పేలవంగా ఉండడంతో వరుడు సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది.అలా అల్లు అర్జున్ కెరీర్ మీద వరుడు మూవీ గట్టి దెబ్బ కొట్టింది అని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: