మీనాక్షి చౌదరి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.మీనాక్షి చౌదరి హరియాణా రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ దంత వైద్యురాలు. మోడలింగ్‌లో రాణిస్తూ వచ్చిన ఈమె 2018లో ‘మిస్‌ ఇండియా’ విజేత‌గా నిలిచింది. అక్కినేని హీరో సుశాంత్‌ జంటగా 'ఇచ్చట వాహనములు నిలపరాదు' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో మీనాక్షికి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా ఆఫర్స్‌ మాత్రం ఆమెను వరించాయి.ఈ సినిమా తరువాత ఏకంగా మాస్‌ మహారాజ రవితేజ 'ఖిలాడి' సినిమాలో చాన్స్‌ కొట్టేసింది. ఇందులో తన గ్లామర్‌ షో బాగా ఆకట్టుకుంటుంది ఈ భామ.ఇదిలావుండగా ఈ సినిమా తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించగా మీనాక్షి చౌదరి ఒక చిన్న పాత్రలో నటించింది. కథలో అసలు ప్రాముఖ్యత లేని పాత్ర ఇచ్చి మీనాక్షికి త్రివిక్రమ్‌ అన్యాయం చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి ఆఫర్‌ ఇవ్వకున్నా బాగుండేది అంటూ కొందరు ఆ సమయంలో మీనాక్షి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతుగా నిలవడం జరిగింది.గుంటూరు కారం సినిమా ఆమెకి పెద్దగా పేరు తెచ్చింది లేదు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సాధారణంగా తన ప్రతి సినిమాలో ఎవరో ఒకరిని సెకండ్ బ్యూటీగా గ్లామరస్ గా హైలెట్ చేస్తూ ఉంటాడు.ఇక  మీనాక్షి ని కూడా అసలు కథకు ప్రాధాన్యత లేని, గుర్తింపు లేని సైడ్ గ్లామర్ పాత్ర చేసింది.అయినా కెరీర్‌ పరంగా ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఇక ప్రస్తుతం మీనాక్షి వరుసగా చిత్రాలలో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘ది గోట్’  సినిమాలో విజయ్‌తో  కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో  జోడీ కట్టిన ‘లక్కీ భాస్కర్’  సినిమా  విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే విధంగా, త్వరలోనే ఆమె విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్రంతో మీనాక్షి తన నటనను మరింత ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తోంది. మొత్తానికి మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో మెయిన్ రోల్స్ పొందాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మహేష్ బాబుతో మరోసారి మంచి పాత్రలో నటించే అవకాశం రావాలని, మహేష్ బాబు సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించాలని అంతా కోరుకుంటున్నారు. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.తను కెరీర్ పరంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మీనాక్షికి అభిమానులు అభిలాషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: