అందరివాడు సినిమలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించగా ఒక హీరోయిన్ గా టబు మరో హీరోయిన్ గా రిమీ సేన్ నటించారు. బెంగాలీ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీ తెలుగులో కేవలం అందరివాడు సినిమాలో నటించారు. ఈ సినిమాలో రిమీ సేన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించగ ఆమె పర్ఫామెన్స్ సినిమాకు మైనస్ అయిఅంది. అందరివాడు సినిమా డిజాస్టర్ కావడానికి ఆమే కారణమని చాలామంది భావిస్తారు.
అందరివాడు సినిమాలో రిమీ సేన్ కాకుండా మరో స్టార్ హీరోయిన్ నటించి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని ఫ్యాన్స్ భావిస్తారు. అందరివాడు సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అందరివాడు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టిందనే చెప్పాలి. అందరివాడు సినిమాలో కొన్ని సీన్లు బాగానే ఉన్నా సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
ఈ సినిమాలోని సెంటిమెంట్ సీన్లు సైతం ప్రేక్షకుల మెప్పు పొందలేదు. రొటీన్ సీన్లతో తెరకెక్కించడం ఈ సినిమాకు మైనస్ అయింది. అందరి వాడు సినిమా తర్వాత చిరంజీవి శ్రీనువైట్ల కాంబోలో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. శ్రీనువైట్ల తర్వాత రోజుల్లో బ్రూస్ లీ సినిమాను రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. శ్రీనువైట్ల ప్రస్తుతం వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.