టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేయాలని అందరూ దర్శకలకు కోరిక మ‌న‌సు లో ఉంటుంది.. అలాగే అందరూ నిర్మాతలకు ఉంటుంది.. ప్ర‌భాస్ ప‌క్క‌న జ‌స్ట్ ఒక్క సినిమాలో అయినా చేయాల‌ని అందరూ హీరోయిన్లకు ఉంటుంది. ఆయన కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఉన్న బిజీలో ఒకటి కాదు రెండు కాదు .. వచ్చే ఏడు సంవత్సరాలు పాటు కాల్ సీట్లు ఫుల్ బిజీ అయినట్టు తెలుస్తుంది. అసలు ఇది మామూలు సంచలనం కాదు .. ప్రభాస్ కు అస్సలు తీరిక ఉండటం లేదు. చాలా తక్కువ టైంలో వరుసగా సలార్ - కల్కి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.


ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ఉంటుంది. ఎలా లేదన్నా ఆ సినిమా షూటింగ్ ఏడాది పాటు నడుస్తుంది. ఆ తర్వాత సలార్ 2 - కల్కి 2 సినిమాలు ఉంటాయి. ఇవి కూడా కనీసం మూడు సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకుంటాయి అన‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడకే నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫాజీ సినిమా ఉంది. ఈ సినిమాకి ఏడాది పడుతోంది.


ఇక ఆ వెంటనే లోకేష్ కనకరాజ్ - ప్రశాంత్ వర్మ ఇద్దరు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు ఏడాది చొప్పున‌ వేసుకున్నా మొత్తం ప్రభాస్ లైనప్‌ వచ్చే ఏడు సంవత్సరాలు పాటు అస్సలు ఏమాత్రం ఖాళీ లేకుండా కనిపిస్తోంది. ఇక ప్రభాస్తో ఎవరైనా సినిమాలు చేయాలి అనుకుంటే ఏడు సంవత్సరాల తర్వాత ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొరటాల శివ - త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమాలు చేయాలి అనుకుంటే ఇప్పటిలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: