కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తాజాగా అమరన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మోస్ట్ టాలెంటెడ్ నటిమని అయినటువంటి సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగులో కూడా అక్టోబర్ 31 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో అమరన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.32 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.02 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 2.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.04 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 1.54 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk