సినిమా ఇండస్ట్రీ లో మొదట ఒకరితో అనుకున్న పాత్రను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా తెరకెక్కించడానికి ప్రధాన కారణం మొదట మూవీ యూనిట్ ఒకరిని ఒక పాత్రకు అనుకొని వారిని సంప్రదించగా వారు మాత్రం ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో , సినిమా కథ నచ్చకో , వేరే కారణాల వల్ల ఆ పాత్రను రిజెక్ట్ చేయడం వల్ల ఆ పాత్రను వేరే వారితో తెరకెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే అలా త్రిష ను ఒక పాత్రకు అనుకోగా ఆమె ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఆ మూవీ లో జెనీలియా హీరోయిన్గా నటించగా ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించిందట. ఆ మూవీ ద్వారా ఆమెకు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది అని తెలుస్తుంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? త్రిష ఎందుకు ఆ మూవీ ని రిజెక్ట్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో బాయ్స్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో జెనీలియా హీరోయిన్గా నటించింది. ఇకపోతే శంకర్ మొదట ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఈమెను సంప్రదించి కథ మొత్తాన్ని కూడా వివరించాడట. కథ మొత్తం విన్న త్రిషకు ఈ సినిమా కథ సూపర్ గా నచ్చిన కూడా ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో శంకర్ , జెనీలియా ను సంప్రదించాడట. జెనీలియాకు ఈ కథ మొత్తాన్ని వివరించగా ఆమె కథ సూపర్ గా నచ్చడంతో ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పిందట. అలా శంకర్ మొదట ఈ సినిమాలో త్రిష ను హీరోయిన్గా అనుకున్న ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ జెనీలియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో జెనీలియాకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: