ఫేమ్ ఫదర్ ఫాజిల్" అనే పదబంధం కంటే, మలయాళ సినిమా రత్నం అని పిలుస్తే ఫహద్ ఫాజిల్‌కు మరింత న్యాయం చేసినట్లవుతుంది. తన తండ్రి ఫాజిల్ వారసత్వాన్ని కొనసాగిస్తూ మలయాళ సినిమాలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఫహద్ ఫాజిల్. తన ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇకపోతే తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన "కైయేతుం దూరత్" చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఫహద్ తొలి సినిమా తో ప్రేక్షకులను అంతగా ఆకటుకోలేకపోయాడు. దానితో అతను  "బెంగుళూరు డేస్" చిత్రంతో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఫహద్‌ కు అనేక అవార్డులు కూడా దక్కాయి. తన కెరీర్‌లో విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రయోగాలకు భయపడని నటుడిగా ఫహద్‌ ను గుర్తించవచ్చు.

కామెడీ, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల చిత్రాలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. "మహేషింతే ప్రతిరాకం", "కుంబలంగి నైట్స్" వంటి చిత్రాలు ఫహద్ కెరీర్‌లో మరపురానివి. ఇకపోతే ఫహద్ ఫాజిల్ మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి జంట మలయాళ సినిమాలో ఒక ప్రసిద్ధ జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట త్రో బ్యాక్ ట్రెండ్ అవుతోంది.

అలా ఇప్పుడు దక్షిణాది సినీ అభిమానులకు ఇష్టమైన నటుడు  ఫదర్ ఫాజిల్ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది. సోఫా మీద నిలుచొని వాళ్ళ అమ్మను చూస్తూ నవ్వుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్ గానూ మెప్పిస్తున్నాడు. అలాగే పాత్ర నచ్చితే స్టార్ హీరోల సహాయక పాత్రలు సైతం పోషిస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈయన తెలుగులో నటించిన  సూపర్ డీలక్స్, విక్రమ్, మామన్నన్ , వేట్టయాన్, పుష్ఫ, ఆవేశం.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక  "పుష్ప" చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: