టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మాత్రం నితిన్ కు సరైన విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. నితిన్ ఆఖరుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ సినిమాలోనూ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు.

ఈ రెండు మూవీల షూటింగ్లు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాబిన్ హుడ్ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదల కోసం దిల్ రాజు ఆ నేలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలి అని దిల్ రాజు డిసైడ్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఫిబ్రవరి నెలలో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ దిల్ రాజు మాత్రం ఫిబ్రవరి నెలలో తమ్ముడు మూవీ ని విడుదల చేయడానికి డిసైడ్ అయ్యాడు అనే వార్త బయటకు రావడంతో కొంత మంది దిల్ రాజు అనవసరంగా రిస్క్ చేస్తున్నాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: