గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిపోతొందనే వార్తలు రోజు రోజుకి వినిపిస్తున్నాయి.. కానీ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మాత్రం మా మధ్య అలాంటిదేమీ లేదంటూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మెగాస్టార్ అభిమానులు పుష్ప-2 సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదంటూ ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో అల్లు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.


గడిచిన కొద్ది రోజుల క్రితం అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ హైదరాబాదులో జరిగిందట. అయితే ఇందులో గేమ్ చేంజెర్ సినిమాకి సంబంధించి కొన్ని పనులు అయితే జరుగుతున్నాయని అదే మీటింగ్లో కూడా పుష్ప-2 చిత్రానికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేయాలని ఈ చిత్రాన్ని మెగా అభిమానులు పట్టించుకోకూడదని అన్ని జిల్లాలలోని ఫాన్స్ అసోసియేషన్ కి చిరంజీవి అఖిల భారతి యువత స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మీటింగ్లో ప్రచారం అయితే జరిగిందట. కానీ ఈ విషయం మీద అఖిల భారత చిరంజీవి యువత జనరల్ సెక్రెటరీ, ప్రముఖ నిర్మాత బాబి ఏడిద స్పందించడం జరిగింది.



అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టించవద్దని తామంతా గేమ్ చేంజింగ్ సినిమాకి సంబంధించి ఈవెంట్ గురించి మాత్రమే ఆలోచించామని.. సినిమాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే షేర్ చేయండి అంతేకానీ ఇలాంటి అనవసరమైన ట్విట్లను షేర్ చేయకండి అంటూ తెలిపారు.. నిన్నటి రోజున పుష్ప చిత్రానికి సంబంధించి కటౌట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా అఖిలభారతి చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కృష్ణ ప్రసాద్ కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. దీంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చేందుకే ఇలా చేశామని తెలియజేశారట. అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా అఖిల భారత చిరంజీవి యువత ప్రధాన ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పుష్ప-2 సినిమా గురించి తాము ఎలాంటి కామెంట్స్ గాని నిర్ణయాలు కానీ తీసుకోలేదంటూ చిరంజీవి అఖిల భారతి యువత తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: