•ఒకప్పుడు స్టార్ హీరోలకు దీటుగా నటన...

•హీరోలే విలన్లుగా మారుతుంటే అవకాశాలు కనుమరుగు..

•ప్రదీప్ రావత్ మళ్లీ సక్సెస్ అవుతారా..

గతంలో ఎంతోమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.  ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా.. మరి కొంతమంది కొన్నేళ్లపాటు తమ హవా చూపించి, ఈ మధ్యకాలంలో అడపా దడపా పాత్రలలో నటిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ కూడా ఒకరు. 2004 లో రాజమౌళి తీసిన సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో నటించి తన నటనతో భయపెట్టించేసారు. ఈ సినిమాతో ఏకంగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది ఈ నటుడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాలలో కూడా నటించి భయపెట్టి విలన్ గా పేరు సంపాదించారు.



అయితే మొదట్లో స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ప్రదీప్ రావత్ ,ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకుండా వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకోవడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి.  ముఖ్యంగా కొన్ని చిత్రాలలో కామెడీ విలన్ గా కూడా మిగిలిపోయారు. ఇక తర్వాత రాను రాను స్టార్ హీరోలు కూడా విలన్లుగా మారడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.ప్రస్తుతం  బాలీవుడ్ తో పాటూ కన్నడ, మలయాళం, ఒడిస్సా, బెంగాలీ తదితర చిత్రాలలో కూడా నటించారు.


2023లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా ఒక చిన్న పాత్రలో నటించారు.. గతంలో ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటించిన ప్రదీప్ రావత్,  2018 నుంచి సంవత్సరానికి ఒక్క చిత్రంలో మాత్రమే విలన్ గా నటిస్తూ ఉన్నారు.. ఇక రాబోయే రోజుల్లో విలన్ పాత్రలలో కూడా తెలుగు ప్రేక్షకులకు కనిపించడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే కొత్తగా విలన్ లు టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతూనే ఉన్నారు.. ముఖ్యంగా ఇతర భాషలలో నుంచి కూడా విలన్సు రావడం చేత ఇలాంటి వారికి అవకాశాలు చాలా తక్కువగానే వెలుబడుతున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి నటులు కనుమరు కావడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: