అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యతో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది శోభిత ధూళిపాల. అయితే రీసెంట్గా ఏఎన్ఆర్ అవార్డ్స్ లో చాలా ట్రెడిషనల్ గా మెరిసింది . అక్కినేని ఇంటికి కోడలు హోదాను కట్టబెట్టేసాడు అక్కినేని నాగార్జున . ఈ క్రమంలోనే ఆమెకు ఇండస్ట్రీలో స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు . అంతేకాదు త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లను హీరో హీరోయిన్లుగా పెట్టి ఒక మంచి సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారట స్టార్ డైరెక్టర్ .
ఇలా రియల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ని తెరపై చూపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు డైరెక్టర్ లు. దానికి కారణం వాళ్ళ మధ్య కెమిస్ట్రీ సీన్స్ బాగా పండుతాయి అని . రీసెంట్గా ఒక టాప్ డైరెక్టర్ శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్ తో సినిమాని ఫిక్స్ చేసుకున్నారట . త్వరలోనే ఇది స్పెషల్ అనౌన్స్మెంట్ గా అభిమానులకు తెలియజేయబోతున్నారట . అంతేకాదు శోభిత ధూళిపాళ్ల ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మరో మెట్టు ఎక్కబోతుంది అంటున్నారు అభిమానులు. అక్కినేని ఇంటికి కోడలుగా ఆమె ఎప్పుడో తెలుగు ఇంటి కోడలుగా మారిపోయింది అని.. శోభిత ధూళిపాళ్లకు అన్ని గుడ్ రోజులే రాబోతున్నాయి అని ..కచ్చితంగా నాగచైతన్య లైఫ్ మరో రేంజ్ లో టర్న్ కాబోతుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . దీంతో శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల చేత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభిత తో బాగా ఫ్రెండ్షిప్ కొనసాగించాడు . ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఇప్పుడు భార్యాభర్తలుగా ఆ బంధాన్ని మార్చుకోబోతున్నారు ఈ జంట..!