- హీరోయిజంతో మెప్పించి విలనిజంతో బెదరగొట్టిన జగపతిబాబు..
- హీరోగా జగపతిబాబు కెరీర్ డౌన్ ఫాల్.
-స్టార్ హీరోలకు బెస్ట్ విలన్ గా..

 జగపతిబాబు.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో ఒకరిగా కొనసాగిన ఈయన ప్రస్తుతం హీరోలకి తండ్రి పాత్రల్లో స్టార్ హీరోలకు విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈయన తన నటనతో కేవలం హీరో గానే కాదు విలన్ గా కూడా తన నట విశ్వరూపం చూపించారు. అయితే అలాంటి జగపతిబాబు కెరియర్ ఇండస్ట్రీలో డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

 జగపతిబాబు కి అవకాశాలు తగ్గడం:
శుభలగ్నం, మావిచిగురు, మావిడాకులు, అంతఃపురం, శుభాకాంక్షలు, పెళ్లయిన కొత్తలో, క్షేత్రం,హనుమాన్ జంక్షన్, శివరామరాజువంటి ఎన్నో సినిమాల్లో ఈయన హీరోగా అలరించారు.అయితే అలాంటి జగపతిబాబు కెరియర్ టాలీవుడ్ లో ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయింది. దాంతో ఈయనకు సినిమాల్లో అవకాశాలు కరువయ్యాయి. అలా చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జగపతిబాబు చివరికి బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ ద్వారా విలన్ పాత్రలో మొదటిసారి నటించారు.అయితే హనుమాన్ జంక్షన్ మూవీ లో విలన్ లక్షణాలు ఉన్న హీరోగా చేసినప్పటికీ పూర్తిస్థాయి విలన్ గా మాత్రం లెజెండ్ మూవీలోనే చేశారు.ఆ తర్వాత జగపతిబాబుకి అన్ని విలన్ అవకాశాలే వచ్చాయి. అలా విలన్ అవకాశాలతో పాటు స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు కూడా చేసే అవకాశాలు ఈయనకు వస్తున్నాయి.


అలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉన్న జగపతిబాబు ఉన్నట్టుండి విలన్ గా మారడంతో చాలామంది ఈయన అభిమానులు హర్ట్ అయ్యారు. కానీ నటుడు అంటే కేవలం హీరోయిజంతోనే కాదు విలనిజంతో కూడా మెప్పించాలి అని జగపతిబాబుని చూసాకే అర్థమైంది. అలా ఈయన ఏ పాత్ర ఇచ్చిన సరే అందులో ఒదిగిపోయి నటిస్తూ ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. అయితే సినిమాల ద్వారా ఎన్నో కోట్ల డబ్బులు సంపాదించిన జగపతిబాబు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఉన్న డబ్బును అంతా పోగొట్టుకున్నారట.కానీ ఆ తర్వాత డబ్బు విలువ ఏంటో తెలిసి మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు లేకపోతేనే వాటి విలువ తెలుస్తుంది అన్నట్లు జగపతిబాబు తన జీవితంలో కోల్పోయింది ఏంటో తెలుసుకొని మళ్లీ దాన్ని సంపాదించుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: