- తన గొంతుతోనే అందరినీ అలరించిన షాయాజీ షిండే..
- విలనిజంతో అదరగొట్టిన నటుడు..

 ఒకప్పుడు ఇండస్ట్రీలో విలన్ అంటే పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు,లుంగీలు కట్టుకొని,మెడలో కర్చిప్పులు వేసుకొని, చెదిరిన జుట్టు తో చాలా అసహ్యంగా చూపించేవారు. కానీ ఇప్పటి జనరేషన్లో అయితే హీరోలు ఎలా ఉంటున్నారో వారి కంటే హ్యాండ్సమ్ గా విలన్లు ఉంటున్నారు.. అయితే ఇలాంటి వారిలో కొంతమంది ఆడియన్స్ ని మెప్పిస్తే మరి కొంత మంది మాత్రం మెప్పించలేకపోతున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకున్న షాయాజీ షిండే లాంటి విలన్ల కి ప్రస్తుతం ఆఫర్లు తగ్గడానికి కారణం ఏంటి.. ఆయనను టాలీవుడ్ లో తొక్కేసింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం

 ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్స్ అంటే అందరికీ ప్రకాష్ రాజ్,ప్రదీప్ రావత్, సోనుసూద్, షాయాజీ షిండే,ఆశిష్ విద్యార్థి, నాజర్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి,ముఖేష్ ఋషి వంటి పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడైతే ఈ విలన్లకు అసలు సినిమాల్లో విలన్ అవకాశాలు కూడా రావడం లేదు. వచ్చినా కామెడీ విలన్లుగా  చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు చాలామంది హీరోలే విలన్లుగా మారుతున్నారు. దీంతో అప్డేట్ అయిన దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో విలనిజాన్ని పండించడానికి స్టార్ హీరోలను పెట్టి సినిమా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో ఫహద్ ఫాజీల్,దగ్గుబాటి రానా, కిచ్చా సుదీప్, తమిళ్ నటుడు ఆర్య, సునీల్, పృథ్వీరాజ్ వంటి ఎంతో మంది హీరోలు విలన్ లుగా మారుతున్నారు.ఇక త్వరలోనే బాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్నారు.అలాగే రజినీకాంత్ కూలి మూవీలో నాగార్జున కూడా విలన్ గా చేస్తున్నారు.


అలా హీరోలే విలన్ గా చేస్తూ ఉంటే ఇక విలన్లకు అవకాశాలు ఎక్కడ వస్తాయి అని కొంతమంది సినీ ప్రేమికుల అభిప్రాయం. ఇదిలా ఉంటే తన గొంతుతోనే ఎంతోమందిని అట్రాక్ట్ చేసే తన విలనిజంతో అందరినీ మెప్పించిన షాయా షిండేకి ఈ మధ్యకాలంలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలందరి సినిమాల్లో షాయాజీ షిండే విలన్ గా నటించారు. ఆయన విలనిజానికి చాలామంది బెదిరిపోయేవారు.ముఖ్యంగా కామెడీగా కనిపించే ఆయన ఫేస్ తోనే విలనిజాన్ని పండించడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆయన వాయిస్ అంటే ఎంతోమందికి ఇష్టం ఉండేది. అయితే అలాంటి షాయాజీ షిండే కి ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది విలన్ గా రావడం లేదు. అయితే ఈయనకు టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా దర్శకనిర్మాతలే. ఎందుకంటే దర్శకులు పాత విలన్లను పాత చింతకాయ పచ్చడి లాగా భావించి వారిని తీసుకోకుండా హీరోలతోనే నెగిటివ్ పాత్రలు చేయించడం కారణంగా చాలామంది విలన్లకి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: