డైరెక్టర్ రాఘవేంద్రరావు, సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో డ్రైవర్ రాముడు చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమా 2-2-1979 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా 35 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా 14 సెంటర్లలో కూడా 100 రోజులకు పైగా ఆడిందట. అలాగే రెండు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ కూడా ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలోని పాటలు కొన్ని బూతు పాటలు లాగా చూపించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి..


ఎన్టీఆర్, రాఘవేంద్రరావు చిత్రాలతోనే ఆత్రేయను చూసి వేటూరి సైతం పోటీపడే వారట.. అలా డ్రైవర్ రాముడు చిత్రంలో వంగమాకు అనే పాట బూతు పదంగా చిత్రీకరించారట.. ఈ పదం తెలుగు టీవీ ఛానల్ లో వినిపించడంతో మింగుడు పడడం లేదట. చాలామంది ఈ పాటను సైతం బూతు పదంగా అర్థం చేసుకున్నారట.. ప్రస్తుతమైతే ఇలాంటి పదాలను ఎక్కువగా ఎవరూ పట్టించుకోరు.. ఎందుకంటే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ సినిమాలలోనే కాకుండా పలు షోలలో కూడా కమెడియన్సు పంచు డైలాగులతో డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో డబల్ మీనింగ్ డైలాగులు పాటలు అన్నా కూడా చాలామంది అసహ్యించుకునేవారు.


డ్రైవర్ రాముడు చిత్రంలో.. గుగ్గుగుగ్గు గుడిసుంది అనే పాటతో పాటు.. వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగా పాకమాకు.. ఇదే కాకుండా పండిస్తే పూవిస్తే.. అనే పదాలు ఉపయోగించడంతో పాటు.. మరి పాయ్ర్ పాయ్ర్.. అంటూ ఎన్టీఆర్ బాడీ సైన్స్ తో కూడా పలు రకాల విషయాలను డైరెక్టర్ చూపించారు. అయితే ఈ పాటలు జనాలు చూడాలి అంటే బూతులే మార్గమా అన్నట్టుగా మారిపోయిందట.. అంతేకాకుండా  పాటలు రాసేటువంటి ఆత్రేయ కూడా భూత్రేయ ఎలా అయ్యారో ఈ సినిమాలోని పాటల ద్వారా వేలెత్తి చూపించారట. అందుకే చాలామంది ఈ పదాలను సైతం  ముద్రికరించడానికి నిషేధించారట. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కెరియర్ లో డ్రైవర్ రాముడు సినిమా ఒక మైలురాయిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: