- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మోసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా .. జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెర‌కెక్కించిన సెన్సేషనల్ పాన్‌ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నెంబర్లు సెట్ చేసి దాదాపు థియేటర్ ర‌న్‌ ముగించుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రు. 550 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక నెక్స్ట్ ఈ సినిమా ఓటీటీ లోకి రావడం ఒకటే మిగిలి ఉంది. దీనిపై కొన్ని డేట్లు కూడా వినిపించాయి.


సినిమా నవంబర్ 8న సౌత్ భాషలో .. అలాగే హిందీలో 22న ఓటీటీ లోకి వస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ డేట్ లో దగ్గరికి వస్తుండడంతో అభిమానులు ఆసక్తి నెలకొంది. దేవరను ఇప్పటికే థియేటర్ల లో చూసి ఎంజాయ్ చేసిన వారంతా ఇప్పుడు ఓటీటీ లో చూసి మరోసారి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 8 డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గ‌జ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈనెల 8న దేవర ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంటే .. ఇంకా ఎందుకు అఫీషియల్ గా ప్రకటన రాలేదు అన్నది కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఇదొక్కటే అభిమానులను గందరగోళంలో పడేసింది. నెట్ ఫ్లిక్స్‌ నుంచి దేవర ఓటిటి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వస్తే ఇక తిరుగు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: