పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఎన్నో హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది. చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. కొన్ని నెలలుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మీడియ ముందుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది సామ్. కానీ అంతకు ముందు ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బీటౌన్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.గతంలో ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇక పై మీరు స్పెషల్ సాంగ్స్ చేస్తారా ? అని అడగ్గా.. చెయ్యనని చెప్పింది. అలాగే మీరు సింగిల్ గా ఉండాలని అనుకుంటున్నారా అంటే లేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంటే ఇకపై సామ్ స్పెషల్ సాంగ్స్ చేయనని.. అలాగే సింగిల్ కాకుండా మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పిందంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ నేపథ్యంలోనే ఆ చిట్ చాట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంది. వీకెండ్ సార్ టైం లో సమంత ఎలా ఉంటారని ప్రశ్నించగా.. తాను ఎక్కువగా పాడ్ కాస్ట్ వింటుంటానని, చాలామంది తాను ఇండస్ట్రీ నుండి వచ్చాను కాబట్టి మూవీస్ కు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన వాటి గురించి వింటారా భావించవచ్చు కానీ, తాను అన్పర్చినట్లు హెల్త్ కు సంబంధించిన ఆడియోస్ ను ఎక్కువగా వింటానని, ఇంగ్లీషులో ప్రసారమయ్యే డాక్టర్ హ్యుబర్ మెన్ చాలా ఎక్కువ గా వింటానని, అందులోని తాను ఫన్ వెతుక్కుంటానని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: