టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ మనసుకి బాగా నచ్చిన సాంగ్ ఏదో తెలుసా ? అది టాలీవుడ్ కింగ్ నాగార్జునది కావటం విశేషం. ఈటీవీలో ప్రసారం అవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం రెండో పార్టు తాజాగా విడుదలైంది. ఇందులో ప్రభాస్ తనకు ఇష్టమైన పాటలు గురించి పంచుకున్నారు. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సినిమాలోని విధాత తలపున ప్రభవించినది పాఠ చాలా గొప్పగా ఉంటుంది... అలాగే స‌ర‌సుస్వ‌ర సుర ఝ‌రీగ‌మ న‌మౌ సామ‌వేద సార‌మిది పాట‌లో అనే లైన్ ఎంత బాగా ఎలా రాశారో .. సిరివెన్నెల గారి పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప పాఠ‌లు వచ్చేస్తాయేమో అని ప్రభాస్ తెలిపారు.


అలాగే నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కన్నుల్లో నీ రూపమే పాట అంటే తనకు చాలా ఇష్టమని ఆ పాట చరణం లో వచ్చే లైన్స్ కు తలవంచుకుని నేను తెగ ఎదురు చూశాను .. నేను ఆయ‌న‌కు వీరాభిమానిని ప్రతి తరానికి సరిపోయే రాయటం సిరివెన్నెల గొప్పతనం. సాహిత్యానికి ప్రాధాన్యం ఉన్న పాట‌లు రాసిన ఆయన శివ సినిమాలో బొటని పాట ఉంది లాంటి టీజింగ్ పాటు కూడా రాశారు. ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా.. ఎక్కడికి వెళ్ళినా ఈ పాట‌ పాడేవాడిని ఇది సిరివెన్నెల గారు రాశారని తెలిసి ఆశ్చర్యపోయారు అప్పట్లో ఇది చాలా సంచ‌ల‌నం సృష్టించింది అని ప్రభాస్ తెలిపారు.


ఇక చక్రం సినిమాలో జగమంత కుటుంబం పాటతో ఆయన చాలా పెద్ద ప్రయోగం చేశారు అని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. అలాగే అంకురంలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కూడా తనకు చాలా నచ్చుతుందని వినడానికి చాలా సింపుల్ గా ఉన్న లోతైన భావం ఉన్న పాట ఇది.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా రాశారు. గమ్యంలో ఎంతవరకు ఎందుకు వరకు కూడా బాగుంటుంది... గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు పాటలో సమాజంపై ఆయన తపన కనపడుతుంది అంటూ ప్రభాస్ సిరివెన్నెల పాటల్లో గొప్పతనాన్ని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: